1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. small dog

Bipasabasu | small dog | best friend | men | నన్నేమన్నా అంటే నా కుక్క పగలబడి పీకుతుంది: బిపాస

బాలీవుడ్
బాలీవుడ్ సెక్సీరాణి బిపాసాబసు మగాళ్లతో విసిగిపోయినట్లు మాటాడుతోంది. మాటమార్చే మగాళ్లకంటే విశ్వాసం చూపించే కుక్క నయం అంటోదట. ఇవాళ చెప్పింది రేపు చెప్పలేదనే మగాళ్లకంటే, ఒక్కసారి స్నేహం చేస్తే తోక ఊపుకుంటూ తనవద్దే కూచుకుని తనను చూస్తూ గుటకలు మింగే బుల్లికుక్క అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిందట. "మీరు కుక్కను అంతగా నమ్మడానికి కారణమేమిటి మిస్" అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే... దానికి చాలా కారణాలున్నాయని అంటోందట.

తన సంగతి ఎలా ఉన్నా, తన తోటి స్నేహితుల్లో చాలామంది కుక్కలనే అతిగా నమ్ముతారని చెపుతోందట. తనకు ఎప్పుడైనా తీరిక దొరికితే తన కుక్కతో సహా మిగిలిన వీధుల్లోని కుక్కలున్న ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తుంటాననీ, ఆ సందర్భంలో వారు తమ కుక్కలు ఎలా తమకు విశ్వాసంగా ఉంటాయో కథలు కథలుగా చెప్పారని "మహా కుక్కలు" కథ చెప్పడం మొదలుపెడుతోందట.

ఇదంతా విన్న ఆ పిల్ల జర్నలిస్టు, "మీ కుక్క చాలా చిన్నదిగా ఉంది. మీకు ఏం సహాయం చేస్తుందీ.." అని అన్నాడట. ఆ ప్రశ్నకు బిపాసా స్పందించడానికి బదులు బిపాసా కుక్క స్పందించిదట. దానికి ఆ భాష అర్థమైందో... లేక బిపాసా సైగ చేసిందో తెలియదు కానీ గుర్ర్... ర్ర్... ర్ర్... అంటూ అతనిపై ఎగిసి దూకబోయిందట.

అంతే.. అతను ఒక్క ఉదుటున ప్రక్కనున్న కుర్చీచాటున నక్కలా నక్కాడట. అది చూసిన బిపాసా పకా పకా నవ్వుతూ... "చూశారుగా దాన్నంటేనే ఇలా చేసింది. ఇక నన్నెవరైనా ఏమైనా అన్నారో.. వాళ్లను పగలబడి పీకుతుంది" అందట. అంతే! పాపం ఆ పిల్ల జర్నలిస్టు పాదరసంలా అక్కడ నుంచి బిపాసా కుక్క కంటపడకుండా జారుకున్నాడట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT