గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » దీపికకు మలేరియానట.. కుట్టింది హైద్రాబాద్ దోమా..? లండన్ దోమా...? (Deepika Padukone | malaria | London shooting | Housefull | Love 4 ever)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
IFM
అందమైన పొడవు చేతులు, పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే మలేరియా జ్వరంతో వణికిపోతోందట. సాజిద్‌ఖాన్ సినిమా హౌస్‌ఫుల్ చిత్రం తాలూకు షూటింగ్‌కోసం లండన్ వెళ్లిన ఈ సుందరాంగి, గత నాలుగు రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతోందట.

దీపికకు మలేరియా ఎప్పుడు ఎటాక్ అయిందన్న విషయంపై యూనిట్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయట. ఆమె ఇటీవల హైద్రాబాద్‌లో లవ్ 4 ఎవర్ చిత్రం కోసం ఈతకొలనులో చాలాసేపు అలా నానుతూ ఓ పాటలో నటించింది. ఆ సమయంలో ఆ నీళ్లలో ఉన్న పాడుదోమ కుట్టి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట కొంతమంది.

మరికొందరైతే.. ప్రదీప్ సర్కార్‌తో కలిసి దీపికా పదుకునే ఇటీవల ఓ సబ్బు ప్రకటనక చేసిందనీ, ఆ ప్రకటనకోసం దీపిక చాలాసేపు షవర్ కింద అలా తడుస్తూ నిలబడిందట. ఆ సమయంలో బాత్రూంలో ఉన్న చెడుదోమ కుట్టి ఉంటుందని చెపుతున్నారు.

మొత్తానికి ఎక్కడి దోమ కుట్టిందో గానీ, పాపం దీపిక మాత్రం మలేరియాతో మంచం పట్టిందట. మరో వారం రోజుల వరకూ ఆమెకు విశ్రాంతి అవసరమని లండన్ వైద్యులు చెప్పారట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: దీపికా పదుకునే, మలేరియా, లండన్, షూటింగ్, లవ్ 4 ఎవర్