1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. diamond belly button

Priyanka Chopra | diamond belly button | parents | Birth day | ప్రియాంకా.. నీ "బొడ్డు"కు డైమండ్ బటన్‌ను తెచ్చాం.. పెట్టుకో!!

ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నటీమణులే అనుకుంటే వారి తల్లిదండ్రులు కూడా వారికి తగ్గట్లే ఉన్నట్లు కనబడుతోంది. గతవారం ప్రియాంకా చోప్రా తన పుట్టినరోజు జరుపుకుందట. ఆ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ప్రియాంకకు మహా గొప్ప బహుమతిని ఇచ్చారట. అది ఏ కారో, బంగళానో కాదు... బొడ్డుపై అతికించుకునే డైమండ్ బటనట. తమ పుత్రికకు టీనేజ్ నుంచి బొడ్డులో డైమండ్ బటన్‌ను గుచ్చుకుని తిరగడం అలవాటని ప్రియాంక తల్లిదండ్రులు చెపుతున్నారట.

తనకు ఈ బహుమతి తన తల్లిదండ్రులు ఇచ్చినట్లు ప్రియాంక స్వయంగా చెప్పిందట. కాగా ప్రియాంకకు ఇంతకుముందే ఓ బొడ్డు వజ్రం ఉండేదనీ, కానీ దానిని ఎక్కడో పోగొట్టుకున్నదనీ ఆమె సన్నిహితులు చెపుతున్నారట. అప్పట్నుంచీ బొడ్డు వజ్రంకోసం ప్రియాంక ఎదురు చూస్తోందట. ఆ తర్వాత కొన్ని బొడ్డు నగలను కొన్నప్పటికీ సినిమాలలో నటించాల్సి వచ్చినప్పుడు వాటిని తీసేయడం, అలా తీసినప్పుడు ఎక్కడో మర్చిపోవడం జరుగుతోందట.

తాజాగా తన తల్లిదండ్రులు ఇచ్చిన బటర్ ఫ్లై ఆకారపు బొడ్డు వజ్రపు బటన్‌ను మాత్రం చాలా భద్రంగా చూసుకుంటానని చెపుతోందట ప్రియాంక. పార్టీలకు, ఇంట్లో ఉన్నప్పుడు బొడ్డుకు ఆ వజ్రపు బటన్‌ను పెట్టుకు తిరుగుతానని చెపుతోందట. కనుక బంగారపు నగల దుకాణాలవారు ఇక నుంచి బొడ్డు అందాన్ని ఇనుమడించే బొడ్డు నగలను తయారు చేయాలన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT