1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Aishwarya

Katrina | Aishwarya | Buffelos | Salman Khan | 10 ka dum | కత్రినా బఱ్ఱె.. ఐశ్వర్యా గేదె: సల్మాన్ ఖుషీ.. ఖుషీ!!

కత్రినా
IFM
సల్మాన్‌ఖాన్ నిర్వహిస్తోన్న రియాల్టీ షో "10 కా ధమ్" యమ జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో చేతికి దక్కకుండా పోయిన గాళ్‌ఫ్రెండ్స్‌పై ఛలోక్తుల పర్వం సాగుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం జరిగిన రియాలిటీ షోలో ఓ పాల వ్యాపారి( సునీల్ మిత్రా) రెండు పాల క్యానులతో షోలో ప్రత్యక్షమయ్యాడు.

వచ్చీ రావడంతోటే సల్లూ భయ్యా... నాకు రెండు బఱ్ఱెలున్నాయన్నాడు. వాటిలో ఒక బఱ్ఱె పేరు కత్రినా అనీ, మరో గేదె పేరు ఐశ్వర్యా అని చెప్పడంతో సల్మాన్ తో పాటు అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. ఆ తర్వాత ఆ బఱ్ఱెలు గురించి చెపుతూ.. కత్రినా బఱ్ఱె వద్దకు వెళితే అది కావలసినన్ని పాలు ఇచ్చిందనీ, ఐశ్వర్య గేదె వద్దకు వెళితే కాలితో ఎగిసి ఒక్క తన్ను తన్నిందని చెప్పాడు.

ఆ తర్వాత ఏం చేశావ్ అని సల్లు అడిగితే... "ఐశ్వర్య గేదే... ఐశ్వర్య గేదే.. నేను ఇప్పుడు అభిషేక్ వద్దకు వెళ్లబోతున్నా.. కాస్త పాలివ్వవూ" అంటే అప్పుడు ఇచ్చింది అని చెప్పాడతను. దీంతో షోలో పాల్గొన్నవారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. సల్మాన్ మాత్రం షో ముగిసిన తర్వాత తన గదికి వెళ్లి తలుపులు మూసుకుని మరీ దిక్కులు పిక్కటిల్లేలా తెగ నవ్వాడట. ఇది నిజంగా సంతోషమా... కసి ఆనందమా...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT