1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sundar.c

Simran| Sundar.c| Sensor| Song| OkkaMagadu| John Apparao| Na Vayasu 16 | "సిమ్రాన్‌" పాటకు సెన్సార్‌ కత్తెర..!

సిమ్రాన్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఆ మధ్య ఓ వెలుగు వెలిగిన పొడువు కాళ్ల సుందరి సిమ్రాన్‌ ఇప్పుడు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సరైన బ్రేక్‌ కోసం తహతహలాడుతోంది. 

ఈ మధ్యనే తెలుగులో 'జాన్‌ అప్పారావు 40 ప్లస్‌', 'ఒక్కమగాడు' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అయితే ఆ రెండూ అపజయాన్ని చవిచూశాయి. దీంతో ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న 'ఐందామ్‌ పడై' చిత్రంపైనే సిమ్రాన్‌ ఆశల్ని పెట్టుకుంది.

ఖుష్బు భర్త సుందర్‌.సి కథానాయకుడిగా నటిస్తూ, అవ్ని సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇందులో కీలకమైన ఓ పాటపై ఇటీవల సెన్సార్‌ కత్తెర పడింది. సిమ్రాన్‌, సుందర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో శృంగారం పాళు ఎక్కువగా ఉండటంతో 'ఎ' సర్టిఫికేట్‌ ఇస్తామని సెన్సార్‌ సభ్యులు తెగేసి చెప్పారట.

కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో క్లీన్‌ యు కోసం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడంతో చివరకు ఆ పాటను సినిమా నుంచి తొలిగించక తప్పలేదట. దీంతో 'ఐందామ్‌ పడై'కి క్లీన్‌ చిట్‌ లభించింది. నిజానికి ఈ పాట కోసం సిమ్రాన్‌ ఏకంగా 65 కాస్ట్యూమ్స్‌ ధరించి చాలా హాట్‌గా కనిపిస్తుందట.

ఈ పాటకు సెన్సార్ కత్తెర పడటంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకునే ఛాన్స్ మిస్సైందేమోనని అమ్మడు తెగబాధపడిపోతుందట. అంత కష్టపడి పాటకు డ్యాన్స్ చేసి, కాస్ట్యూమ్స్ మార్చిన తన శ్రమంతా వృధా అయిపోయిందని సిమ్రాన్ వాపోతుందట.

అయితే తమిళంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో తెరకెక్కిన 'కిచా వయసు 16' చిత్రం ఇప్పుడు 'నా వయసు 16' పేరుతో తెలుగులో రాబోతుంది. ఈ సినిమా ద్వారానైనా తనకు మంచి బ్రేక్ వస్తుందని సిమ్రాన్ నమ్ముతోంది. ఇంకేముంది? సిమ్రాన్‌కు "నా వయసు 16" మంచి పేరు సంపాదించి పెడుతుందో? లేదో? వేచి చూడాల్సిందే..!.