Surya| Anushka| Tollywood| Kollywood| Surya| Vijay| Mahesh Babu | హ్యాండ్సమ్ "సూర్య" సరసన సెక్సీతార "అనుష్క"!
టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల రాశి అనుష్క. "అరుంధతి" చిత్రం ద్వారా బొమ్మాళీగా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్.
"బిల్లా"లో బికినీతో మాస్‌ను ఆకట్టుకున్న అనుష్క తాజాగా పలు కోలీవుడ్ సినిమాల్లో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చేసిందని తెలిసింది.
"ఇరండు" (రెండు) చిత్రం ద్వారా కోలీవుడ్ రంగం ప్రవేశం చేసిన అనుష్క తాజాగా తమిళ యంగ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు గజిని, వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఫేమ్ సూర్యతో అనుష్క జతకట్టనుందని సమాచారం.
"సింగం" అనే పేరిట రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా అందాల తార అనుష్క.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన కొత్త సినిమాలో నటిస్తోంది.
