1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Raja

Jaganmohini| Raja| Namitha| Romance| Meera Chopra | సముద్ర అంతర్భాగంలో "జగన్మోహిని"తో రాజా రొమాన్స్!

జగన్మోహిని
మల్టీప్లెక్స్ హీరో రాజా "ఇంకోసారి" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. రిచా, మంజరి, రాజాలు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న 'ఇంకోసారి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

మరోవైపు.. జగన్మోహినితో రాజా రొమాన్స్ చేస్తున్నాడట. ఇదేదో విదేశాల్లోనూ, పార్క్‌ల్లోనూ కాదండీ..! ఏకంగా సముద్ర అంతర్భాగంలో జగన్మోహిని నమితతో రాజా రొమాన్స్ చేసే సన్నివేశాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే చిత్రీకరించింది.

రాజా, నమిత, మీరా చోప్రా, జ్యోతిలక్ష్మిలు కీలక పాత్రలు పోషించే జగన్మోహిని చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాన్ని సముద్ర అంతర్భాగంలో షూట్ చేశారు.

ఈ సీన్‌కోసం నమిత, రాజాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారని చిత్ర యూనిట్ అంటోంది. ఇంకా రాజా, నమితలు నటించిన ఆ రొమాన్స్ సీన్ అదిరిందని, తప్పకుండా ప్రేక్షకులను ఆ సీన్ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అంతేగాకుండా.. సముద్ర అంతర్భాగంలో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు ప్రత్యేకంగానూ, అద్భుతంగానూ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మరి.. జగన్మోహిని సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో? వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M