1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Ramcharan teja

Magadheera | Ramcharan teja | Gladiater | English film | ఒరిజినల్ మగధీరుడో లేక గ్లాడియేటర్ గ్జెరాక్సో..?!!

రామ్ చరణ్ తేజ
WD
రామ్‌చరణ్ తేజ చిత్రం మగధీర విడుదలకు మరో రెండు రోజుల సమయమే ఉంది. అయినా మగధీరకు మెరుగులు దిద్దే కార్యక్రమం మొన్న ఆదివారం వరకూ సాగింది. ఆదివారం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాల రీషూట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రీకరణ ముగిసిన వెంటనే సోమవారం సెన్సార్ కార్యక్రమాలు చకచకా జరిగాయట. మొత్తమ్మీద చూస్తే... రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రం సక్సెస్ కోసం నిర్విరామ కృషి జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఇంతటి భారీ బడ్జెట్టుతో, ఇంతటి మహా ఘనమైన సబ్జెక్టును చేయలేదని టాలీవుడ్ సినీజనం టాక్. రషెస్ చూసిన మెగాస్టార్ చిరంజీవే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారంటే మగధీర ఏ లెవల్లో ఉండి ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

అవన్నీ అలావుంటే... వళ్లు గగుర్పొడిచే కత్తి యుద్ధాలు, గుఱ్ఱాలపై రివ్వున బాణంలా దూసుకుపోయే కండల వీరుని విన్యాసాలు, ఉక్కుమనిషిలా కనిపించే దృఢకాయుడు, మహోజ్వాలలను విసరగల తీక్షణమైన అతని కంటిచూపులు, శత్రువులపై మెరుపు దాడి... ఇలా ప్రతి సన్నివేశం ఎంతో రసవత్తరంగా చిత్రీకరించిన ఇంగ్లీషు సినిమా గ్లాడియేటర్‌కు మగధీరకు దగ్గర పోలికలున్నట్లు టాలీవుడ్ టాక్. చిత్రం విడుదలైతే గానీ "మగధీర" ఒరిజినల్ మగధీరుడా... లేక గ్లాడియేటర్ గ్జెరాక్సో తెలియదు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT