Minissha lamba | Salman Khan | love | Katrina kaif | కత్రినా వదిలేసిందిగా.. నేను ప్రేమిస్తా... రా!!
బాలీవుడ్ బాంబ్ షెల్ మినిష్షా లాంబా సల్మాన్ అనుమతిస్తే అతడిని ప్రేమలోకంలో ముంచెత్తుతానని అంటోందట. ఎలాగూ కత్రినా కైఫ్ ఎడముఖం అయింది కనుక, సల్మాన్ "ఊ..." అంటే అతడిని ప్రేమలోకంలో ఓలలాడిస్తానని చెపుతోందట.
కాదనుకున్నవారిని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకునేకంటే, అవునంటున్న తనలాంటి వారితో స్నేహం చేస్తే మనసు మళ్లీ పునరుత్తేజాన్ని సంతరించుకుంటుందని పెద్ద పెద్ద డైలాగులు చెపుతోందట.
తన మనసులో ఇప్పటివరకూ ఏ మగాడు లేడనీ, అయితే ఇటీవల కాలంలో సల్మాన్ గురించి థింక్ చేసినప్పుడు అతడిని ప్రేమించాలనిపించిందని మినిష్షా తన మనసులోని మాట చెప్పిందట. అలాగే సల్మాన్‌తో నటించాలని ఎప్పటి నుంచో కలగంటున్నానీ, ఆ కల నెరవేరుతుందని ఆశపడుతున్నట్లు చెప్పింది.
