1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. She wolf

Chiranjeevi | She wolf | Hyderabad | మెగాస్టార్ ఇంటిపైకి దుమికిన ఆడ తోడేలు..?!!

చిరంజీవి
WD
దేశంలో మరో వదంతి బయలుదేరింది. కనిపించన పెద్ద ఆడ తోడేలు ఒకటి దేశంలో సంచరిస్తోందనీ, అది కొన్ని కట్టడాలపైకి దుముకి వాటిలోకి చొరబడేందుకు యత్నిస్తోందన్న వదంతులు బయలుదేరాయి. ఈ ఆడ తోడేలు కాలి ముద్రలతో కూడిన ఆనవాళ్లు చెన్నైలోని సెంట్రల్ స్టేషన్, ఆగ్రాలోని కుతుబ్ మినార్, ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియాపై కనిపించాయట.

ఇదిలావుంటే ఈ తోడేలు తన దృష్టిని కట్టడాలపై నుంచి సెలబ్రిటీల గృహాలపై మరల్చినట్లు వదంతులు వినబడుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటిపైకి దూకి ఎలాగైనా ఇంట్లో చొరబడటానికి ప్రయత్నం చేసిందట. అది అలా ప్రయత్నించినట్లు తెలిపే కాలి ముద్ర చిరు ఇంటిపై ఉండటాన్ని తాము చూశామని కొందరు చెపుతున్నారట.

ఇంతకీ ఇలా గాలిలో అమాంతం ఎగరగల ఆడ తోడేలు నిజంగా దేశంలో సంచరిస్తుందా...? ఒకవేళ అదే నిజమైతే ఆ తోడేలు ఉన్నట్లుండి దేశం మొత్తాన్ని అలా చుట్టి రావడం వెనుక కారణం ఏమిటి...? అసలు ఇది నిజమేనా...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి