గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » అడవి ఫినిష్... ఇక పరిటాల "రక్త చరిత్ర"పై రాము దృష్టి (Ramgopal Varma | Rakta Charitra | Paritala Ravi | Suri)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
సస్పెన్స్ థ్రిల్లర్ అడవి దాదాపు పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ తన దృష్టిని "రక్త చరిత్ర"పై మళ్లించారు. పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని రూపొందించనున్న ఈ చిత్రంలో అనేక ఉత్కంఠభరితమైన అంశాలను జోడించే పనిలో వర్మ నిమగ్నమై ఉన్నారు.

రక్త చరిత్రకు ఆధారంగా తీసుకుంటున్న పరిటాల రవి పుట్టు పూర్వోత్తరాలు, ఆయన జీవితంలో జరిగిన వరుస సంఘటనలు, హత్యకు దారితీసిన పరిస్థితులన్నింటినీ వర్మ క్షుణ్ణంగా తెలుసుకుని ఆ ప్రకారం స్క్రిప్టును పక్కాగా రూపొందిస్తున్నారట.

ఇందులో భాగంగా ఆమధ్య చర్లపల్లి జైలులో ఉన్న మద్దలచెరువు సూరిని కలిశారు కూడా. అప్పట్లో దీనిపై సర్వత్రా చర్చ సాగింది. సూరితోపాటు ఆయన స్నేహితులు, పరిటాల కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులందరినీ వర్మ కలుసుకుని ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల తాలూకు సంఘటనల నేపథ్యాన్ని తెలుసుకున్నట్లు భోగట్టా.

కాగా ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించనున్నారని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ప్రధాన పాత్రలో తమిళ నటుడు సూర్యను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ సమాచారం. తొలి సినిమా "శివ"తో స్టూడెంట్ రక్త చరిత్రను తెరకెక్కించి బిగ్ హిట్ కొట్టిన రామ్‌గోపాల్ వర్మ, పరిటాల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించనున్న రక్త చరిత్రను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి మరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అడవి, రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర, పరిటాల రవి, సూరి