1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Sridevi

Asin | Sridevi | Sridevi daugter | bollywod | "శ్రీదేవి ఆంటీ..." అసిన్- "అసిన్ ఆంటీ.." శ్రీదేవి కూతురు

అసిన్
IFM
సెక్సీ పిల్ల అసిన్ చెన్నైలో ఉన్న ఇంటిని సైతం అమ్ముకుని బాలీవుడ్‌లో సెటిలయ్యేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది.. దీని వెనుక కారణమేమిటా అని మన పిల్ల జర్నలిస్టు ఆరాతీశాడు. అందులో తేలిందేంటయా అంటే.. అసిన్ ఉంటున్న బిల్గింగు- శ్రీదేవి బోనీకపూర్ ఉంటున్న బిల్డింగూ ఒకటేనట. శ్రీదేవితో అసిన్ గంటలకొద్దీ బాతాఖానీ కొడుతూ కాలక్షేపం చేస్తోందట.

బాలీవుడ్ షూటింగులు వాయిదా పడటంతో ఆ మధ్య తమ ప్రక్క ఇంట్లో ఉన్న పిల్లలతో అసిన్ ఆటలాడుకుంటోందన్న వార్తలు వచ్చాయి కదా. ఈ ఆటలు శ్రీదేవి పిల్లలతోనే అని కనిపెట్టాడు మన పిల్ల జర్నలిస్టు.

ఇదిలావుంటే, శ్రీదేవి భర్త బోనీకపూర్ అసిన్‌ను తెగ పొగుడుతున్నాడట. అసిన్‌కు ఓ పెద్ద నటి అని గర్వమే లేదని చెపుతున్నాడట. అసిన్ అయితే సమయం దొరికినప్పుడల్లా.. "శ్రీదేవీ ఆంటీ..." అంటూ శ్రీదేవి ఇంట్లోకి గంటలకొద్దీ కాలం గడుపుతోందట. ఆ తర్వాత అసిన్ తన ఇంట్లోకి వెళ్లగానే శ్రీదేవి కూతురు, "అసిన్ ఆంటీ..." అని అసిన్ ఇంట్లో కాలక్షేపం చేస్తోందట. మొత్తమ్మీద శ్రీదేవిని వదిలి అసిన్, అసిన్‌ను వదిలి శ్రీదేవి కూతురు ఉండలేకపోతున్నారట. అదండీ అసలు సంగతి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT