Kamilini Mukharjee | Pub | Drinking | Hot drinks | పబ్బుల్లో "మందు" కొడుతున్న కమలినీ ముఖర్జీ
తారల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. తాము అనుకున్న పద్ధతిలో సంప్రదాయంగా హుందాగా వెళ్దామనుకున్నా, ఆ రంగంలోని వివిధ రకాల పరిచయాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు నడుస్తున్న దారిని మార్చుకోవాల్సి వస్తుంది.
హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న కమలినీ ముఖర్జీ ఇటీవల పబ్బుల్లో తాగుతూ తూలుతూ కనబడుతోందట. ఒక సినీ ప్రముఖుడు ఆ రోజు ఆమెను పలకరిద్దామని అనుకుంటే మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల మరుసటిరోజు ఆమెను కలిసి, 'ఏమిటి రోజుకి రెండుసార్లు టీ తాగడానికే ఇష్టపడని నువ్వే ఇలా మందు కొట్టేస్తున్నావ్' అనడిగాడట.
ఆ ప్రశ్నకు కమిలినీ, "ఏముంది. నేను అనుకోకుండా అడుగుపెట్టిన రంగం ఇది. ఈ రంగంలో మడి కట్టుకుని కూర్చుంటే.. మనకు మిగిలేది ఏమీ ఉండదు. అదీగాక సహనటీనటులు వింతగా చూస్తారు. నలుగురితో నారాయణ.. అనే కర్టసీ కోసం అప్పుడప్పుడూ వారికోసం లైట్‌గా మందు తీసుకుంటున్నాను. తప్పదుకదా" అని సింపుల్‌గా చెప్పిందట. లైట్‌గా తీసుకుంటే తూలేలా వాలిపోతారా? మరి ఫుల్ తీస్కుంటే? ఏమవుతారూ...? అనేది వారి ప్రశ్న.
