1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Boyfriend

Priyamani | Boyfriend | kiss | Bikini | బాయ్‌ఫ్రెండ్ ముద్దడిగితే ఇవ్వాల్సిందే... తప్పదు: ప్రియమణి

ప్రియమణి
టాలీవుడ్‌లో బికినీతో నటించడంపై కొందరు రభస చేస్తున్నారంటూ బికినీ భామ ప్రియమణి రుసరుసలాడుతోంది. తనకంటే ముందే ఎందరో మరింత కురచ బికినీల్లో సొగసులు ఆరబోస్తూ నటించారని గుర్తు చేస్తోంది. పైగా నీటిలో ఈతకొట్టేటపుడు చీరతో ఈదుతారా...? అని ప్రశ్నలు వేస్తోంది. అన్నిటికీ మించి తను ఎప్పుడూ లంగా ఓణిలో నటిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని, అందువల్లనే కాస్తంత గ్లామర్‌గా కనిపించాలని బికినీ వేసినట్లు చెపుతోంది. 

అదిసరే... ముద్దు గురించి మీ అభిప్రాయం ఏమిటీ.. అని ఓ కుర్ర జర్నలిస్టు అడిగితే... ఇలా చెప్పుకొచ్చింది. "ముద్దు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్లగానే మా నాన్నగారు నాకు ముద్దులు పెడతారు. మా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు ఒకరికొకరం ఎగబడి ముద్దులు పెట్టుకుంటాం.

ఇక సినిమా విషయానికి వస్తే... ధనుష్ నాకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. ఇక ప్రేమికుల ముద్దు విషయానికి వస్తే, 20 ఏళ్ల అబ్బాయి తన గాళ్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ముద్దు పెట్టాలన్న కోరిక కలగడం సహజమే. ఆ ఫీలింగ్‌ను ఎవరూ ఆపలేరు." అంటూ ముదురు "ముద్దు" సమాధానం చెప్పింది.

అంటే మీ బాయ్‌ఫ్రెండ్ మీకు ముద్దుపెట్టినా మీరు అడ్డు చెప్పరన్నమాట అని అంటే, చివాల్న చూసి... "ఇదే వద్దనేది. ముద్దు గురించి చెప్పమన్నారు. చెప్పానంతే. నాకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. బాయ్‌ఫ్రెండ్ లేనప్పుడు ఇక ముద్దు ఎలా పెడతాడు.. " అని తిరుగు ప్రశ్న సంధించింది ప్రియమణి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT