1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Kiss

Shilpa Shetty| Kiss| Bollywood| Big b Reality Show| Richard gere | పొడుగుకాళ్ల సుందరిని ముద్దుగోల వదలదా..?

శిల్పాశెట్టి
ప్రముఖ బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని ముద్దు వివాదం వదిలేలా కనిపించడంలేదు. 

ఎయిడ్స్‌పై ప్రచారంలో భాగంగా భారత్ వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె ఆమెను బహిరంగంగా ముద్దుపెట్టుకోవడంపై దేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేగిన విషయం తెల్సిందే. తాజాగా మరో ముద్దు వివాదంలో శిల్ప చిక్కుకుంది.

ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా శిల్పాశెట్టి ఇటీవలే ఒరిస్సాలోని సాక్షిగోపాల ఆలయాన్ని సందర్శించింది. అయితే అక్కడ శిల్పాశెట్టిని చూసి తెగ మురిసిపోయిన ఓ వృద్ధ అర్చకుడు ఆమెను ఆశీర్వదించే క్రమంలో.. ఆలయంలోనే ముద్దెట్టుకున్నాడట.

దైవ సన్నిధిలో ఉన్న విషయాన్ని పూర్తిగా మరిచి పోయిన పూజారి.. ముద్దుగుమ్మను బుగ్గపై గట్టిగా ముద్దెట్టుకోవడం.. ప్రస్తుతం దుమారానికి దారితీసింది.

మొత్తం మీద ఈ పొడగుకాళ్ళ సుందరి ఎక్కడకు వెళ్లినా పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. బిగ్‌బీ రియాలిటీ షోలో హాలీవుడ్ నటి జేడ్ గూడీ చేతుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్న శిల్పా.. అప్పటి నుంచి తరచూ వార్తల్లోకెక్కుతూనే ఉంది.
About Writer
SELVI.M