1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Rahul Gandhi

Diya Mirza| Rahul Gandhi| Bollywood| Bhopal| Congress Party | "వాట్ ఎ మ్యాన్"..! ఆయనంటే నాకెంతో ఇష్టం..!

దియా మీర్జా
FILE
"ప్రజలను ప్రభావితం చేసే సత్తా ఆయనకుంది. నిర్మలమైన, నిష్కలమైన మనస్తత్వం ఆయనిది. అంతేకాదు.. గొప్పవ్యక్తి అయిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ అంటే నా కెంతో ఇష్టమని" బాలీవుడ్ భామ దియా మీర్జా చెప్పింది.

తన అందచందాలతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటున్న దియా.. ఎట్టకేలకు మనసులోని మాటను బయట పెట్టింది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు నచ్చిన వ్యక్తి ఎవరబ్బా? అని అందరూ ఎదురుచూస్తుండగానే.. దియా రాహుల్ అంటే తనకు ఇష్టమని చెప్పేసింది.

భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దియా.. రాహుల్ వ్యక్తిత్వాన్ని, రాజకీయ జీవితంపై ప్రశంసల వర్షం కురిపించింది. మరి అందాల ముద్దుగుమ్మ దియా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ పెదవి విప్పుతారో? లేదో? వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M