1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. RamGopal Varma

Adavi| RamGopal Varma| Priyanka Kothari| Nithin| Gym| Srilanka| Mumbai | రామ్.."అడవి"లో నా కోసం జిమ్ ఏర్పాటు చేయవూ..!!

అడవి
సినిమాల్లో హీరోహీరోయిన్లుగా రాణించాలంటే ఫిట్‌నెస్ సంగతిని మరవకూడదని సినీ పండితులు అంటుంటారు. ఈ విషయాన్ని "అడవి" హీరోయిన్ ప్రియాంక కొఠారి బాగా అర్థం చేసుకుంది. అందుకే అడవుల్లో షూటింగ్ కోసం వెళ్లినా.. అక్కడే వ్యాయామం చేసిందట. 

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన "అడవి" చిత్రాన్ని దాదాపుగా శ్రీలంక అడవుల్లో చిత్రీకరించారు. అలాంటి కీకారణ్యంలో.. క్రూర మృగాల మధ్య సుమారు నలభైరోజులు నటించేందుకు ప్రియాంక అభ్యంతరం చెప్పలేదు.

కానీ.. అక్కడ తనకోసం జిమ్‌లేకపోవడం ఆమెకు పెద్ద సమస్యగా మారింది. దాంతో 40 రోజులూ తాను వ్యాయామం చేసేలా.. ప్రత్యేక ఏర్పాటు కల్పించమంటూ రామ్‌ను ప్రియాంక కోరిందట. వెంటనే స్పందించిన రామ్, కొఠారి కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశాడట.

సిబ్బందిని పురమాయించి ముంబై నుంచి శ్రీలంక.. అక్కడ నుంచి అడవుల్లోకి సుమారు 60 కిలోమీటర్ల దాకా.. వ్యాయామ పరికరాలను తెప్పించాడు. దీనికోసం అవసరమైన అనుమతులు తీసుకోవడం నుంచి.. ఆ రిస్క్‌ మొత్తం భరించాడు.

ఇప్పటివరకు హీరోయిన్ల కోసం ఇలాంటి సదుపాయాలేవీ కల్పించని రామ్ ప్రియాంకపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంపై సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇవన్నీ విన్న ప్రియాంక మాత్రం చాలా ఆనందంగా ఉందని తెలిసింది.

అంతేకాదు.. వ్యాయామంపై తాను ప్రత్యేక దృష్టి పెడతానని, శ్రీలంక అడవుల్లో షూటింగ్ జరుగుతున్నకాలం వ్యాయామం చేయలేనేమోనని చాలా భయపడ్డాను.

కానీ చెప్పిన వెంటనే రామ్ స్పందించి జిమ్ ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రియాంక వివరించిందట. ఇంకేముంది..? ప్రియాంకకు రామ్‌గోపాల్ వర్మ అనుగ్రహం కలిగిందన్నమాట..!.
About Writer
SELVI.M