1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nitin Reddy

Adavi | Nitin Reddy | Priyanka Kothari | Bollywood | బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి బ్లో- అప్

అడవి
"అడవి" చిత్రం వర్మకు హిట్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ కుర్ర హీరో నితిన్ మాత్రం... "అడవి" తంతే బాలీవుడ్ బూరెల బుట్టలో పడ్డాడంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. ప్రియాంకా కొఠారి సరసన సిక్స్ ప్యాక్ బాడీతో స్టెప్పులేసిన యంగ్ హీరో నితిన్ బాలీవుడ్‌లో నితిన్ రెడ్డిగా పరిచయమయ్యాడు. 

"అడవి"లో నితిన్ రెడ్డి యాక్షన్ చూసిన కొందరు బాలీవుడ్ నిర్మాతలు నితిన్‌కు తమ తమ సినిమాల్లో అవకాశాలిచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో మీసాలు తీసేసి బోడి మూతులతో నటించే హీరోలతో విసిగిపోయిన ప్రేక్షకులు నితిన్ రెడ్డి లాంటి చాకులాంటి కుర్రహీరోలను చూసేందుకు ఇష్టపడుతున్నట్లు ఓ బాలీవుడ్ సినీ నిర్మాత చెప్పాడు.

మొత్తమ్మీద అడవితో నితిన్ దశ తిరిగిందన్నమాట. బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి తన ఇమేజ్‌ను ఎలా బిల్డప్ చేసుకుంటాడో చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT