NTR| Balakrishna| Craze| Simha| Cinema| Shooting| Kalyan Ram| Tarakaratna | ఎన్టీఆర్‌కే క్రేజట.. మరి బాలయ్య సినీ చరిష్మా అంతేనా..?
WD
అలా తొలినాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఆరాటపడేవారు. బాబాయ్ అంటూ.. ఆయన వస్తే చాలు.. అదే పదివేలుగా భావించి ఆయన ప్రాపకం పొందడానికి ప్రయత్నించేవారు.
ఎన్టీఆర్ సినిమాల ప్రారంభోత్సవాలకు బాలకృష్ణ ఎస్సెట్. అది కొడాలి నాని తీస్తున్న సినిమా వరకు సాగింది. "బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయ"న్న సామెతలా.. ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి అలానే ఉందని సినీపండితులు విశ్లేషిస్తున్నారు.
బాలయ్య తాజా సినిమా "సింహా" ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ పెద్ద ఆకర్షణగా నిలిచాడు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అందరూ ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్ అనే పేరు తెచ్చుకున్నాడు. సినిమా ఫీల్డులోనూ ప్రస్తుతం బాలయ్య చిత్రాలు ఏమీ ఆడడం లేదు. ఎన్టీఆర్ యువకుడు గనుక ఆయన చిత్రాలు బాగానే చూస్తున్నారు.
"సింహా" ప్రారంభోత్సవానికి బాలకృష్ణ వచ్చి ముహూర్తం ప్రకారం పూజచేశారు. కాసేపటికి తన అసిస్టెంటుతో అందరూ వచ్చారా? అంటూ అడిగాడు. వస్తున్నారంటూ అసిస్టెంట్ సమాధానమివ్వడంతో ఓకే... అంటూ మళ్లీ పూజలో నిమగ్నమయ్యాడు. కాసేపటికి కళ్యాణ్‌రామ్, తారక్‌తో పాటు ఎన్టీఆర్ హాజరయ్యారు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం హుషారెత్తింది.
తర్వాత ఎన్టీఆర్.. బాబాయ్ దగ్గరకు వెళ్ళి నమస్కరించి.. దేవుడికి కొబ్బరికాయ కొట్టాడు. ఎన్టీఆర్ రావడంతోనే కొత్త కళ వచ్చిందని అక్కడివారనుకోవడం విశేషం. మరి టైం అంటే అదే.. ఇంతలోనే ఎంత తేడా.. కదా..!?
