1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Trisha

Nayanthara| Trisha| Simbu| Dating| Kiss| Vallabha| Shooting| Gautham Menon | నయనతో ముద్దు.. త్రిషతో డేటింగ్...‌!!?

నయనతార
"వల్లభ" సినిమా ద్వారా అందాల ముద్దుగుమ్మ నయనతారను "శింబు" వాడుకుని వదిలేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటే.. తాజాగా "వల్లభ" రూటు మార్చాడట. 

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఓ తమిళ చిత్రంలో శింబు, త్రిష జంటగా నటిస్తున్నారు.

ఈ షూటింగ్‌లో ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వీరిద్దరు ప్రేమలో పడ్డారని కూడా సినీజనం అనుకుంటున్నారు.
 
గతంలో నయనతారను ఇలాగే ముద్దు వ్యవహరంలో దించి, ఆ తర్వాత శింబు వదిలేశాడని ఇండస్ట్రీలో టాక్.

ఈ నేపథ్యంలో నీకు కూడా అదే గతి పడుతుందేమో? జాగ్రత్త అని త్రిషకు ఆమె సన్నిహితులు చెప్పారట. కానీ శింబుచాలా మంచివాడని త్రిష సమర్థించిందట.
 
మరోవైపు శింబుని త్రిషతో డేటింగ్‌ చేస్తున్నారా? అని అడిగితే..? ఆ వ్యవహారం చాలా బాగుంటుందన్నట్లు నవ్విఊరుకున్నాడట.

మరి ఈ వ్యవహారం ఎంతవరకు వస్తుందో? వేచి చూడాల్సిందేనని మన సినీ పండితులు అంటున్నారు.
About Writer
SELVI.M