1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Actors

Cinema| Actors| Word| Lucky| Name| Asha Saini| Reema Sen| Archana | అక్షరం మారితే.. అదృష్టం వస్తుందా..?

సినిమా
WD
కాలం కలిసి రాకపోతే పేర్లను మార్పు చేసుకుని ట్రై చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సినీ పరిశ్రమలో బోలెడు మంది కన్పిస్తారు. అసలు పేరును మార్చేసి కొసరి పేరుతో తెలుగు ఇండస్ట్రీలో మెలిగేవాళ్లూ చాలామంది ఉన్నారు.

ఇందులో హీరో నవీన్‌, తనపేరును నవ్వీన్‌గా మార్చుకున్నా ఫలితం లేకపోయింది. అలాగే హీరోయిన్‌ వేద అర్చనగా పేరు మార్చుకుని తన జాతకాన్నిపరీక్షించుకుంది. కానీ 'బ్యాంక్‌' సినిమా విడుదలకాకపోవడం ఆమెకు నిరాశనే మిగిల్చింది.

ఇక కథానాయిక ఆషాషైనీ విషయానికొస్తే.. ఫ్లోరా శైనీగా తన పేరును మార్చుకుని, ఆ తర్వాత అదీ కలసి రాకపోవడంతో 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా "మనసంతా నువ్వే" ఫేమ్‌ రీమాసేన్‌ తన పేరులోని ఇంగ్లీషు అక్షరాల్లో ఇంకో 'ఎమ్‌'ని అదనంగా చేర్చేసుకుంది. ఈ పేరు మార్చుకున్న తర్వాత ఇటీవలే ఓ ఫంక్షన్‌కు రీమాసేన్ హాజరైందట.

ఆ ఫంక్షన్‌లో స్లీవ్‌లెస్‌ అందాల్ని ప్రదర్శించి అందరిచేత 'వావ్‌' అనిపించేలా చేసిందట. మరి రీమాసేన్‌కు ఈ రకంగా పేరు వచ్చిందన్నమాట..!
About Writer
SELVI.M