ఎన్టీఆర్‌కు ఆ యాక్సిడెంట్ సమీరాతోనే అయ్యిందట!
ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్‌తో పలువురు అగ్రనిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు.
దీంతో ఏ నిర్మాత సినిమాలో ముందు నటించాలో తెలుసుకోవడం ఎన్టీఆర్‌కు కష్టతరమవుతోంది. ఇప్పటికే కొడాలి నాని సినిమాలో ఎన్టీఆర్ నటిస్తుండగా.. మరోవైపు అశ్వనీదత్ చిత్రం ముందుకు వచ్చింది.
ఇంకోవైపు నల్లమలుపు బుజ్జి సినిమాకూడా చేయమని అనడంతో ఎవరిది ముందు చేయాలో? తెలియక ఎన్టీఆర్ సందిగ్థంలో పడ్డారు.
ఇందులో ట్విస్ట్ ఏమంటే.... ఎన్నికల సమయంలో ఎన్.టి.ఆర్. మందుకొట్టి కారుడ్రైవర్‌చేసి యాక్సిడెంట్‌కు గురికాలేదనీ, సమీరారెడ్డి విమానంలో వేరే దేశం వెళుతూ.. హైదరాబాద్‌లో కాసేపు ఆగతుందని చెప్పడంతో.. ఆమె కోసమే ఎన్.టి.ఆర్. కారును స్పీడ్‌గా డ్రైవ్‌చేసి చెట్టుకు ఢీకొని తీవ్రగాయాలకు గురైనట్లు ఫిలింనగర్ వర్గాల గుసగుసలాడుకుంటున్నాయి.

