Akkineni Akhil | Sridevi | Janvi | Tollywood | అక్కినేని అఖిల్ సరసన శ్రీదేవి పెద్ద కూతురు
IFM
ఇటీవల రాధ కుమార్తె అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య సరసన "జోష్" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీని నటింపజేయనున్నట్లు సమాచారం. అయితే జాన్వీ ఇంకా చిన్నపిల్లలానే ఉండటంతో మరో సంవత్సరం ఆగి అఖిల్‌తో నటింపజేయాలని శ్రీదేవి- నాగార్జున నిర్ణయించారట.
మొదటి సినిమాతోనే తమ వారసులు బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టాలన్న కృతనిశ్చయంలో నాగ్, శ్రీదేవి ఉన్నారట. శ్రీదేవి తన కుమార్తెకు నటనలో మెళకువలు నేర్పుతోందట. అలాగే సినిమాలో నాట్యాలను ఎలా చేయాలన్న దానిపై రోజుకు కనీసం నాలుగు గంటలకు తగ్గకుండా తర్ఫీదునిస్తోందట. మరి ఇరువురు వారసులు ఎంతటి సక్సెస్ చవిచూస్తారో వేచి చూడాలి.
