RamDev| Abbas,| Gracy Singh| Rajasekar| Evadithe Nakenti | "రామ్దేవ్" నిర్మాత జిమ్మిక్కులు ఫలించేనా?
WD
గతంలో రాజశేఖర్ హీరోగా నటించిన "ఎవడైతే నాకేంటి" చిత్రానికి కూడా బషీద్ నిర్మాణ సారథ్యం వహించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే బషీద్‌పై జూబ్లీహిల్స్‌లో లాండ్ మాఫియా, బెదిరింపులు కేసులు నమోదయ్యాయి. తాజాగా రామ్‌దేవ్ చిత్రాన్ని బిజినెస్ చేయడానికి హీరోయిన్లు, హీరోలు కలిసి ఉన్న సన్నివేశాలను మార్ఫింగ్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేశారు.
ఈ విషయం తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను వ్యతిరేకించారు. అంతేకాదు.. సినిమా రేటును కూడా రామ్‌దేవ్ నిర్మాత డిస్ట్రిబ్యూషన్ కోసం తగ్గించినట్లు సమాచారం.
కానీ.. రామ్‌దేవ్ నిర్మాత రకరకాలుగా జిమ్మిక్కులు చేసినా ఆ సినిమా వ్యాపారం కావడం కష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు జోస్యం చెబుతున్నారు. మరి రామ్‌దేవ్ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్‌లు ఫలిస్తాయో? లేవో? వేచి చూడాల్సిందే..!
