Sameera Reddy | Kuala Lumpur | Tamil film | security guards | Malaysia | సమీరా రెడ్డిని ఎత్తి పడేసిన సెక్యూరిటీ గార్డులు
బాలీవుడ్ నటి సమీరారెడ్డి నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ మలేసియాలోని కౌలా లంపూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న సమీరకు ఆ దేశంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. మలేసియా ప్రధానమంత్రికి రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్డులు సమీరా రెడ్డిని దాదాపు కొట్టినంత పనిచేశారట.
వివరాలలోకి వెళితే.. సమీరా రెడ్డి షూటింగ్ ముగించుకుని తన హోటల్ గదికి లిఫ్ట్‌లో వెళుతుండగా పదిమంది సెక్యూరిటీ గార్డులు ఇనుప చైన్లతో ప్రవేశించారట. వారు ప్రయాణిస్తున్న లిఫ్ట్ లాబీ ఫ్లోర్‌లోకి ప్రవేశిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు సమీర చేయిని గట్టిగా పట్టుకున్నాడట.
ఈ హఠత్పరిమాణానికి బెదిరిపోయిన సమీర అతడి చేయిని గట్టిగా విదిలించుకుని తిట్ల దండకం అందుకున్నదట. దీంతో రెచ్చిపోయిన సెక్యూరిటీ గార్డులు మలయ్ భాషలో పెద్ద పెద్దగా అరిచి ఆమెను అమాంతం పైకెత్తి లిఫ్ట్ నుంచి బయటకు విసిరి పడేశారట. దీంతో కోపోద్రిక్తురాలైన సమీర హోటల్ యాజమాన్యంపై తోక తొక్కిని పాములా బుసలు కొట్టిందట.
