Trisha| Varsham| Stalin| Krishna| Nuvvostanante nenoddantana| Gopichand| Venkatesh | లేడికళ్ల త్రిష.. ఎక్కడివక్కడే వదిలేస్తుందట..
WD
ఇదిలా ఉంటే.. పౌర్ణమి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, కృష్ణ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష తాజాగా గోపిచంద్ సరసన శంఖం, మళ్లీ విక్టరీ వెంకటేష్‌తో "నమో వెంకటేశ" అనే చిత్రంలో నటిస్తోంది.
పుకార్లకు ఆమడ దూరంలో ఉండాలనుకుంటూనే ఎప్పుడూ వార్తల్లోకెక్కే ఈ భామ ఇటీవలే శింబుకు చాలా క్లోజ్ అయ్యిందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు షూటింగ్ కోసం వచ్చిన త్రిషను ఈ సందర్భంగా మెల్లగా కదిలిస్తే.. తానెప్పుడూ షూటింగ్‌లో పలు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. ఎంత అలసిపోయినా.. ముఖంలో దాని తాలూకు ఛాయలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష వెల్లడించింది.
దీనికోసం నాణ్యమైన ఫేస్ ప్యాక్‌లు, యోగా ప్రాణాయామం చేసి ముఖంలో మంచి కళకోసం ప్రయత్నిస్తానని తెలిపింది. అంతకంటే చాలా ముఖ్యం.. మనసులో లేనిపోని ఆందోళనలు, చికాకులు ఉంచుకోనని త్రిష తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తూ ఉంటే ఏ బెడదా ఉండదని ఈ నునుపుకాళ్ల సుందరి అంటోంది.
మరి.. ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలా? మరి మీరేమంటారు..?.
