Hansika| Desamuduru| Kantri| Kalyan Ram| Maska| Nithin| Heroine | నేను "ముదురు" పాపనంటున్న హాన్సిక
"దేశముదురు" భామ నిజంగానే తాను ముదురు అంటోంది.
అన్ని విషయాల్లోనూ తగిన నిర్ణయం తీసుకునే స్థాయికి తాను ఎదిగానని హన్సిక చెబుతోంది. నిర్ణయాలు తీసుకోవడానికి క్షణం చాలు. వాటిని ఆచరణలో పెట్టడంలో ఆంక్షలుండకూడదని ఈ దేశముదురు సుందరి వెల్లడిస్తోంది.
దేశముదురు, కంత్రి, మస్కా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హన్సిక తాజాగా నితిన్‌తో వెల్ఫేర్ క్రియేషన్‌లోనూ, కళ్యాణ్‌రామ్‌తోనూ నటిస్తోంది.
ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే ఏమంటుందో తెలుసా? "ఒక్కో సంవత్సరం వయస్సు పెరిగేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. నేను మేజర్‌ని. నాకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే విషయాన్ని అమ్మ నాకే వదిలేస్తుంది" అని హన్సిక చెబుతోంది.
