1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Swine Flu

World | Swine Flu | Ish | Amitab | Blog | | ఐశ్వర్యారాయ్‌కు స్వైన్ ఫ్లూ!?

ప్రపంచం
File
FILE
ప్రపంచ ప్రజలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. బాలీవుడ్ అందాలనటి ఐశ్వర్యారాయ్‌కు సోకినట్టు సమాచారం. దీంతో 'రావణ' చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. ఈ విషయాన్ని ఆమె మామ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో వెల్లడించారు.

ప్రస్తుతం ఐశ్వర్యారాయ్... ఛాతీ ఇన్ఫెక్షన్‌తోను, స్వైన్‌ ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత మణిరత్నం నిర్మిస్తున్న 'రావణ' చిత్రం షూటింగ్‌ నిమిత్తం భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఐష్ ఊటీ వెళ్లగా.. అక్కడ అనారోగ్యానికి గురైనట్టు 'బిగ్‌ బి' తన బ్లాగులో పేర్కొన్నారు. ఆమెకు జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో షూటింగ్‌లో పాల్గొనలేదని తెలిపారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి