1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Jab We Met

Tamanna| Jab We Met| Cinema| Tamil| Remake| Lucky| Happy Days| Vyapari | "జబ్ వి మెట్" తమిళ రీమేక్‌లో నటించడం అదృష్టం..!

తమన్నా
WD
"హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ, తెల్లపిల్ల తమన్నా. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉంటోన్న తమన్నా.. టాలీవుడ్‌లోనూ మంచి ఛాన్సులు కొట్టేస్తుందని సినీ వర్గాల సమాచారం.

కాళిదాసు, సూర్య హీరోగా నటించిన "వీడొక్కడే" చిత్రంలో కథానాయికగా నటించిన తమన్నా.. తాజాగా తెలుగు "వ్యాపారి" ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే.. "వ్యాపారి" తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకముందని, ఖుషి దర్శకుడు ఎస్.జె. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేసింది.

అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ మూవీ "టైటానిక్‌" సినిమాను ఎన్నిసార్లు చూశానో తెలియదు. 'జబ్‌ వి మెట్‌' కూడా తనకు ఇష్టమైన సినిమా.

ఈ చిత్రం తమిళ రీమేక్‌లో తాను నటిస్తున్నట్లు తమన్నా వెల్లడించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాత్ర తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది.

"జబ్ వి మెట్" లాంటి చిత్రంలో తన డ్రీమ్‌రోల్‌‌ను పోషించడం ఎంతో హ్యాపీగా ఉన్నా.. ఆ పాత్రకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తమన్నా అంటోంది.

ఇకపోతే.. ఇటీవల తనపై నాన్న ముద్ర పడిపోయిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది.

నాన్నగారే తన సినీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు చూసుకోవడం నిజమే అయినా.. ఒక ప్రాజెక్టును అంగీకరించడంలో తుది నిర్ణయం తనదేనని తమన్నా చెప్పింది. కథ, హీరో, దర్శకుడు అన్నీ నచ్చితేనే ఒప్పుకొంటాను.

ఆపై ప్రాజెక్టును అంగీకరించే విషయంపై నాన్నతో చర్చించి ఆ తర్వాత ఓకే చెబుతానని తమన్నా తెలిపింది.

అంతేగాని.. తాను చేసే సినిమా నాన్నకు మాత్రమే నచ్చితే అంగీకరించే ప్రసక్తే ఉండదని ఆమె కచ్చితంగా చెప్పేసింది. ఇంకేముంది..? ఫ్రొఫెషనల్ పరంగా "తమన్నా" చాలా కరెక్ట్‌గా ఉందన్న మాట..!.
About Writer
SELVI.M