Bhuvaneswari| Kurkure| Tv Serials| Jayalalitha| Raviteja| Anjaneyulu| Brahmanandam | బ్రహ్మానందం ప్రసన్నం కోసం "కుర్‌కురే" భువనేశ్వరి
"కుర్‌కురే" చిత్రంలో మత్తుకళ్లతో అందాలను అధిక మోతాదులో ఆరబోసిన సినీతార భువనేశ్వరి. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్‌లో నటించి తర్వాత వాంప్ పాత్రల్లో కన్పించిన భువనేశ్వరి హీరోయిన్ అవ్వాలనుకుంది.
అప్పట్లో "రామ్‌లక్ష్మణ్"లు హీరోలుగా నటించిన మాస్ చిత్రంలో హీరోయిన్‌గా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత "కుర్‌కురే" సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో సెక్సీగా కనబడినా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.
అయితే.. అంతటితో వెనుకంజ వేయక మళ్ళీ పాతరూటులోనే పయనించి.. హైదరాబాదులో షూటింగ్ ఉంటే శ్రీనగర్ కాలనీలో ఓ ఫ్లాట్‌కూడా కొనేసింది. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "ఆంజనేయులు"లో బ్రహ్మానందం కీప్‌గా నటించింది. బ్రహ్మానందాన్ని ప్రసన్నంచేసుకుని ఆయన చిత్రాల్లో తనకూ అవకాశాలు లభించేలా ప్రయత్నాలు సాగిస్తోంది.
చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసి నటుడు చలపతిరావు అండతో పలు సినిమాల్లో జయలలిత ఛాన్స్ కొట్టేసింది. కానీ అవి ఏవీ పెద్ద ఫలితాన్నివ్వకపోవడంతో టీవీరంగంలోకి వచ్చింది.
తర్వాత "అమ్మమ్మడాట్‌కామ్" హిట్ కావడంతో గృహిణిగా పలు సీరియల్స్‌లో జయలలిత బిజీ అయ్యింది. తన కెరీర్‌లో ఇంత పేరు రావడం చాలా ఆనందంగా ఉందని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.
భువనేశ్వరి కూడా జయలలిత బాటలోనే నడవాలనుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి భువనేశ్వరి ఆశ ఫలిస్తుందో? లేదో వేచి చూడాల్సిందే..!.
