1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hot actress

Katrina Kaif | Hot actress | English Women | కత్రినా కైఫ్ ఇండియన్ కాదు: అయేషా

కత్రినా కైఫ్
టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ భారతీయురాలు కాదట. ఈ విషయాన్ని జాకీష్రాఫ్ భార్య అయేషా తెలిపింది. కత్రినా కైఫ్‌ను భారతీయ సినీ పరిశ్రమకు తానే పరిచయం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. 

సినిమాల్లో నటించాలన్న కత్రినా ఉబలాటం చూసి అప్పట్లో లండన్ అమ్మాయైన కత్రినాను భారతదేశానికి తీసుకువచ్చి హిందీ నిర్మాతలకు పరిచయం చేయడం జరిగిందని అయేషా వెల్లడించింది. కత్రినా తన తండ్రి కాశ్మీరుకు చెందినవాడని చెప్పడంలో ఎంతమాత్రం నిజం లేదని అంటోంది.

ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంగ్లండుకు చెందినవారేనని వెల్లడించింది. భారతదేశ సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కత్రినా ఇలా బూటకపు మాటలు చెపుతోందని అయేషా పేర్కొంది. ఇదిలావుండగా అయేషా వ్యాఖ్యలపై కత్రినాకైఫ్ స్పందించేందుకు నిరాకరించింది. తను ఎవరో.. ఎక్కడ పుట్టానో, ఎవరికి పుట్టానో చెప్పాల్సిన అవసరం లేదని కత్రినా మండిపడినట్లు సమాచారం.

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కథానాయికగా ఉండటాన్ని చూసి కొంతమంది ఓర్వలేక ఇటువంటి వార్తలను పుట్టిస్తున్నారని కైఫ్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT