1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Kajal Agarwal

Magadheera | Kajal Agarwal | Kiss | Remuneration | ఆ రెండు పెదవులపై గట్టిగా చుంబించిన కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్
WD
మగధీర చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ సరసన నటించిన కాజల్ అగర్వాల్‌... ఇటీవల తన రెండు పెదవులతో మరో రెండు పెదవులపై గట్టిగా చుంబించిందట. అరెరే.. అలా ముద్దెట్టేసుకుంటుందేంటి..? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసినా, కాజల్ మాత్రం ఆ పెదవులను వదల్లేదట.

ఆఖరికి ప్రక్కనే ఉన్న సన్నిహిత స్నేహితురాలు, "అందరూ చూస్తున్నారు.. ముద్దుపెట్టుకున్నది చాల్లే వదలు" అనడంతో వదిలేసిందట. ఇంతకీ ఆమె తన పెదవులతో అంత గాఢంగా ముద్దాడింది ఓ బొమ్మను. కాజల్‌కు ఆ బొమ్మ బాగా నచ్చడంతో ముద్దు పెట్టకోకుండా ఉండలేకపోయిందట.

అన్నట్లు మగధీర సూపర్‌హిట్ కావడంతో కాజల్ అగర్వాల్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. ఇదిలివుంటే మగధీరలో కాజల్ నటనను చూసి తమిళ హీరో సూర్య తెగ మెచ్చుకున్నాడట. అంతేకాదు అతని తమ్ముడు కార్తీక్ సరసన నటించే అవకాశాన్నిచ్చాడట. ఇక మన తెలుగులో అయితే ఆర్య-2, గణేష్ చిత్రాల్లో నటిస్తోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT