Arundhathi| Anushka| Bommali| Remuneration| Beauty Queen | "బిల్లా సుందరి" డబ్బు మనిషి కాదట..!
"అరుంధతి"లో రాణి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకుల మదిని దొంగలించిన సెక్సీతార అనుష్క. ఆ తర్వాత సెక్సీ "బిల్లా సుందరి"గా కనిపించింది. రెండు సినిమాలూ సూపర్ హిట్ కావడంతో తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే, తన రెమ్యునరేషన్‌పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల అనుష్క విచారం వ్యక్తం చేసింది. పారితోషికం కంటే పాత్రలకు, సంస్థల కంటే వ్యక్తులకే తాను ప్రాధాన్యతనిస్తానని బ్యూటీ క్వీన్ అనుష్క చెబుతోంది. అనుష్కతో సన్నిహితంగా మెలిగేవాళ్లు కూడా ఆమె చెబుతున్నదాంట్లో అణు మాత్రం కూడా అవాస్తవం లేదని అంటున్నారు.
'స్నేహానికి విలువనిచ్చే సంస్కారం అనుష్క సొంతం. తాను సినీ రంగంలోకి వచ్చేందుకు గతంలో సహాయపడినవారి పట్ల కృతజ్ఞతగా మెలగడం, అవసరమైనప్పుడు వారికి సహాయసహకారాలు అందించడం అనుష్కకున్న సుగుణం.. నైజంగా చెప్పుకుంటారు.
