Megastara | MagaDheera| Chiranjeevi| Happy| Ramcharan Teja| PRP | ''మగధీర'' విజయంతో మెగాస్టార్.. హ్యాపీ.. హ్యాపీ..!
WD
కుమారుడు రామ్‌చరణ్ తేజ నటించిన "మగధీర" బ్రహ్మాండంగా ఉందని అన్ని పార్టీలవారు చెప్పడంతోపాటు ఇండస్ట్రీలో చరణ్ తన వారసుడిగా నిలబడినందుకు చిరు చాలా హ్యాపీగా ఉన్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
చిరు పుట్టినరోజుకు ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్ర సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి అభిమానులు తరలిరావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సోమిరెడ్డి చిరంజీవికి మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ విషయాలను దయచేసి చర్చించకండని.. చిరు సూచించడంతో.. పార్టీ గురించి పెద్దగా వాళ్లు పట్టించుకున్నట్లు కన్పించలేదు. అలాగే భవిష్యత్‌లో మళ్ళీ సినిమారంగంలోకి వస్తున్నారా? అని ఓ నెల్లూరు అభిమాని అడిగిన ప్రశ్నకు.. "నేను ఇండస్ట్రీని విడిచిపెట్టలేదని" చెప్పినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే.. చిరుత ఫేమ్ రామ్‌చరణ్ నటించిన "మగధీర" థియేటర్ల సంఖ్య మళ్లీ పెరగనుంది. నైజాంలోనే 14 థియేటర్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో 30 థియేటర్లకు పైగా పెంచాలని గీతాఆర్ట్స్ నిర్ణయించింది.
ఇటీవలే విడుదలైన అడవి, మల్లన్న చిత్రాల వల్ల "మగధీర"ను సెకండ్ థియేటర్లకు తప్పించారు. ప్రస్తుతం ఆ చిత్రాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో చరణ్ కొత్త సినిమాకు థియేటర్లు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
