Sada| Aparichitudu| A..Aa.. E.. Ee...| Foreign| Shooting| Night Party | రాత్రిపూట పార్టీలంటే నాకు మహా అలర్జీ: సదా
ప్రముఖ దర్శకుడు శంకర్ ఇచ్చిన అవకాశంతో "అపరిచితుడు"లో నటించిన సదాకు, ఆ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని.. సినీ కెరీర్ మారిపోతుందని సినీ పండితులు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించినా సదాకు ఎందుకో విజయాలు పెద్దగా వరించలేదు. తాజాగా తెలుగులో ఆమె "అ..ఆ.. ఇ.. ఈ.." అనే చిత్రంలో నటించింది. దాదాపు ఏడాదిపట్టిన ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు.
తనకు సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంపై సదా తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేసింది. తనకు సినిమాలు తక్కువగా రావడానికి రాత్రి పూట పార్టీలకు వెళ్లకపోవడమేనని చెప్పింది.
అలాగే పబ్‌లలో డ్యాన్స్‌లు చేయడం కూడా సదాకు చిరాకేనని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరి సినీరంగంలోకి అడుగుపెట్టాక ఇవన్నీ సాధారణమే కదా..! అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. సదాకేమో..! రాత్రి పార్టీలంటేనే అలర్జీ అని నొక్కి చెప్పేస్తుంది.
