Josh | Akkineni Naga Chaitanya | September 3 | Magadheera | నాగచైతన్య "జోష్" ఎందుకు వాయిదా పడుతోందీ...?
WD
ఇటీవల విడుదలైన "మగధీర"ను నిలువరించే సత్తా 'జోష్'కు లేనందువల్లే ఆ చిత్రాన్ని నెమ్మదిగా వెనక్కి నెట్టినట్లు టాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు. అదలావుంటే ఆగస్టు మొదటివారంలో విడుదల చేద్దామనుకుంటే వర్మ "అడవి" అడ్డురావడంతో కాస్త వెనక్కి నెట్టినట్లు భోగట్టా.
ఆ తర్వాత రెండో వారంలో విడుదల చేద్దామని యత్నించగా "ఆంజనేయులు" కూడా ఆగస్టు రెండోవారంలోనే విడుదల అవుతుండటంతో మరోసారి వాయిదా పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. పోనీ ఆగస్టు మూడో వారంలోనైనా విడుదల చేద్దామనుకుంటే ఆ వారంలో విక్రమ్ "మల్లన్న" చిత్రం విడుదలైంది. దీంతో జోష్ చిత్రాన్ని సేఫ్‌గా సెప్టెంబరు 3న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తొలిచిత్రం కనుక ఆ మాత్రం జాగ్రత్తలు తప్పవంటున్నారు టాలీవుడ్ సినీజనం.
