Sneha| Bikini| Sowryam| Tollywood| Kollywood| Cinema | ఇప్పుడే పెళ్లి చేసుకోను.. మరో రెండేళ్లు పడుతుంది.!
సినీ హీరోయిన్లందరూ బికినీ వేసేందుకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. చీరకట్టు, సల్వార్లతో కనిపించే హోమ్లీ గర్ల్‌గా ముద్రవేసుకున్న స్నేహ కూడా ఇటీవల బికినీలో కన్పించేందుకు రెడీ అంది. అంతేకాదు.. మరో రెండేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించకూడదని ఆమె నిర్ణయం తీసుకుందట.
తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉండటంతో పాటు ప్రస్తుతం తన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉందని, అందుకే పెళ్లి గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఫ్యామిలీ తరహా పాత్రలు పోషించే స్నేహ ఆ మధ్య బికినీకి కూడా రెడీ అని ప్రకటించి సంచలనం సృష్టించింది.
దీంతో ఆమె మొబైల్‌కు ఓ తుంటరి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంతో అతనిపై కేసుకూడా పెట్టింది. దీంతో ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనని స్నేహ నిర్ణయించినట్లు సన్నిహితులు చెప్పారు.
