1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hansika

Nayanatara | Hansika | Chandi | MS Raju | Tollywood | నయనతారకు అంత సీన్ లేదు.. హాన్సికను తీసుకుందాం....

నయనతార
ఎదపై టాటూలు వేసుకుని గ్లామర్‌కే మెరుగులు దిద్దుకుంటూ దక్షిణాది ప్రేక్షకులను అలరించే నయనతారకు హాన్సిక షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్. రాజు నిర్మిస్తున్న "చండి" చిత్రంలోని ఆమె పాత్రను అత్యంత చాకచక్యంగా లాగేసుకుంది. పైగా ఆ పాత్రకు నయనతారను తీసుకున్నట్లు తనకు తెలియదని సన్నాయి నొక్కులు నొక్కుతోందట.

ఇదిలావుంటే అరుంధతి టైపు పాత్రలో నయనతారకంటే హాన్సిక అయితే ఖచ్చితంగా సరిపోతుందని దర్శకుడు కోడి రామకృష్ణ అభిప్రాయపడ్డారట. అందువల్లనే నయనతారకు బదులు హాన్సికను తీసుకున్నట్లు టాలీవుడ్ న్యూస్.

నయనతారకు ఇటువంటి షాకులు తమిళంలో తమన్నా కూడా ఇచ్చింది. నయనకు వచ్చిన ఆఫర్‌ను చివరి నిమిషంలో తమన్నా గద్దలా తన్నుకుపోయింది. ఆ సందర్భంలో నయనతార తమన్నాను ఏమీ అనలేక, సదరు చిత్ర నిర్మాతపై చిందులు వేసింది.

ప్చ్... నయనతార బ్యాడ్ లక్. ఏం చేస్తాం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT