Kajal Agarwal| Darling| Magadheera| Billa| Prabhas| Arya-2| Allu Arjun | బిల్లాతో "డార్లింగ్" అనిపించుకోనున్న కాజల్ అగర్వాల్!
అత్యున్నత ప్రమాణాలతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర". 'చిరుత'నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో అందాల సుందరి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన కాజల్ అగర్వాల్ రిలాక్స్ కాకుండా మరో చిత్రంలో నటించేందుకు అగ్రిమెంట్లో సంతకాలు కూడా చేసేసింది.
మగధీరతో పాటు రామ్ హీరోగా నటిస్తోన్న "గణేష్" చిత్రంలో కథానాయికగా ప్రేక్షకులను అలరించనున్న కాజల్ అగర్వాల్.. త్వరలో "బిల్లా" హీరో ప్రభాస్‌తో "డార్లింగ్" అనిపించుకోనుంది.
ఇంకేముంది..? కాజల్ అగర్వాల్‌కు "మగధీర" తర్వాత భారీ ఆఫర్లు వస్తున్నాయన్నమాట..!.
