1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress

Meera Chopra | Actress | Jaganmohini | Hotel Industry | నా శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచుతా: మీరా చోప్రా

మీరా చోప్రా
"బంగారం" చిత్రంతో ముందుకు వచ్చిన భామ మీరా చోప్రాకు బంగారమంటేనే ఇష్టముండదట. నగలను ధరిస్తే ఒళ్లంతా పట్టేసిన భావం కలుగుతుందట. తన శరీరం ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంచేందుకు తాను ఇష్టపడతానని చెపుతోందట. అయితే.. జగన్మోహినిలో యువరాణిలా నటిస్తున్నావు కదా.. మరి ఆ పాత్రకు నగలు నట్రా ధరించాల్సి వుంటుంది కదా... అని ఎవరైనా అంటే, సినిమా వరకే కనుక ఎలాకొలా నా శరీరాన్ని ఒప్పించుకుని నటిస్తున్నాను. నిజానికి ఒంటినిండా ఆభరణాలతో నటించాలంటే నాకసలు ఇష్టమే ఉండదు. 

ఈమధ్య వచ్చిన గ్యాప్ గురించి చెబుతూ... "సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది. ఖాళీ సమయల్లో నేను తీరిగ్గా గోళ్లు గిల్లుకుంటూ కూచోను. నాకు నచ్చిన హోటల్ ఇండస్ట్రీలో దిగాను. అన్ని నగరాల్లో నా బ్రాండ్ పేరుతో చెయిన్ ఆఫ్ హోటళ్లను ప్రారంభించాలన్నది నా చిరకాల వాంఛ" అని చెప్పింది.

అందుకే ఢిల్లీలో తన తండ్రి పేరుకూడా కలిసివచ్చే "మిరాజ్" పేరుతో ఈ పరిశ్రమలో కాలిడింది. గొప్ప స్థాయిలో ఈ రంగంలో దూసుక వెళతానని చెబుతోంది. ముక్కుమీద కోపం ఉన్న ఈ అమ్మడికి అదే సూటవుతుందని కొందరు "చోప్రా" బాధితులు అంటున్నారట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT