1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Hot actress

Sexy Sreya | Hot actress | Mallanna | Bollywood | Kollywood | నేను వాళ్లకు ఐదు నిమిషాలే కావాలట: శ్రేయ

సెక్సీ శ్రేయ
WD
"మల్లన్న"లో ఎద సొగసులను ఆరబోసి టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన సెక్సీ శ్రేయ, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది. తన మకాన్ని కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మార్చిన వేళా విశేషమో ఏమిటో గానీ... హిందీ నిర్మాతలు శ్రేయ కాల్షీట్లకోసం ఫోనులుమీద ఫోనులు చేస్తున్నారట. వారితోపాటు తెలుగు, తమిళ నిర్మాతలు కూడా అప్పుడప్పుడు "లైన్"లోకి వస్తున్నారట.

అయితే దక్షిణాదివారికి "నో" చెప్పేస్తోందట శ్రేయ. ఎందుకూ అని ఎవరైనా అడిగితే... ఏం చెప్పేదీ... "వాళ్ల చిత్రాల్లో నేను ఓ ఐదు నిమిషాలు వచ్చి కనిపిస్తే చాలట. మిగిలినది నా పోజులను పెట్టి చుట్టేసుకుంటారట" అని చెప్పుకొచ్చిందట.

ఇదే విషయాన్ని దక్షిణాది నిర్మాతల వద్ద ప్రస్తావిస్తే.. ఐదు నిమిషాలకే మాకు చుక్కలు కనబడుతున్నాయి. ఆమె పారితోషికం ఎంతో చెపితే కళ్లు గిర్రున తిరుగుతాయి. అంత ఇచ్చుకోలేకనే ఓ పదో.. పదిహేను నిమిషాలో చూపించి క్యాష్ చేసుకుందామని అనుకుంటున్నట్లు ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టారట. అదండీ అసలు కారణం. ఇంతకీ శ్రేయ పారితోషికం ఎంత? అని అడుగుదామని ప్రయత్నిస్తే... "హీరోయిన్ పారితోషికం... మగాడి జీతం అడక్కూడదు" అని జారుకుందట శ్రేయ.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT