Actress Namitha | Viral fever | Kollywood | Nadigar Sangam | జ్వరమొచ్చి మూలుగుతుంటే.. రమ్మంటే ఎలా..?: నమిత
WD
ఈ నోటీసుపై నమిత కారాలు మిరియాలు నూరుతోందట. తను వైరల్ జ్వరంతో వణికిపోతుంటే ఫంక్షనుకి రాలేదని నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తోందట.
ఎలాగైనా సినీ ఫంక్షనుకు హాజరవుదామని కప్పుకున్న దుప్పటి తీసి మంచం మీద నుంచి లేవబోతే వళ్లంతా వణకడం ప్రారంభించిందట. దాంతో ఆమె వ్యక్తిగత వైద్యులు.. "మీరు ఎక్కడికీ వెళ్లకూడదు. విశ్రాంతి ముఖ్యం" అని చెప్పారట. వైద్యుల సలహా మేరకు తను ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని చెపుతోందట.
అవును మరీ... అసలే చెన్నైలో స్వైన్ ఫ్లూ ఉందంటున్నారాయె. ఆ మాత్రం భయం నమితకు ఉండటం సహజమే కదా...!!
