1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. BujjiGadu

Sanjana| BujjiGadu| Prabhas| Raja| Samardhudu| Kannada| Mollywood| Tollywood | "బుజ్జిగాడు" సుందరికి భలే ఆఫర్లొస్తున్నాయట..!

సంజన
WD
"బుజ్జిగాడు" చిత్రం ద్వారా దక్షిణాది సినీ రంగంలో ఆరంగేట్రం చేసిన సెక్సీతార సంజన. బిల్లా స్టార్ ప్రభాస్‌తో బుజ్జిగాడులో రెండో కథానాయికగా నటించిన సంజన ఈ మధ్య హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజా హీరోగా చేసే సమర్థుడు చిత్రంలో హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తోన్న సంజన ఈ మధ్య తెగ బిజీ బిజీగా ఉంటోందని సినీ జనం అంటున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన సమర్థుడు చిత్రం త్వరలో తెరపైకి రానున్న నేపథ్యంలో.. సంజన కన్నడంలో ఓ పెద్ద బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించబోతోందని సమాచారం. అలాగే మలయాళంలోనూ సంజనకు ఆఫర్ల మీద ఆఫర్లొస్తున్నాయని తెలిసింది.

ఇకపోతే.. షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేని సమర్థుడు చిత్రంలో సంజన నటించేందుకు రాజానే ఛాన్స్ ఇప్పించాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇంకేముంది? సంజనకు టాలీవుడ్ ఛాన్సులే కాదు.. దక్షిణాది సినీ రంగాల్లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయన్నమాట..! ఎనీ వే ఆల్ ది బెస్ట్ సంజన..!
About Writer
SELVI.M