1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Bommali

Arundathi| Bommali| Anushka| Mahesh Babdu| Dialogue| Tollywood| Pokiri| Billa | "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను": బొమ్మాళీ

అరుంధతి
WD
"అరుంధతి" తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా మార్కులేసుకున్న సెక్సీతార, బిల్లా సుందరి అనుష్క ఈ మధ్య టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డైలాగ్‌లు చెప్పుకుని తిరుగుతుందట. ఇంతకీ విషయమేమిటంటే..? అరుంధతి తర్వాత ఈ భామ మళ్లీ అటువంటి ప్రాధాన్యత గల సినిమాలో నటించడానికి అగ్రిమెంట్లో సంతకం పెట్టింది.

మళ్లీ అలాంటి పాత్రనే ఎందుకు పోషిస్తున్నారని బొమ్మాళీని అడిగితే.. "నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అంది. ఇదేదో పోకిరి మహేష్ బాబు డైలాగ్‌లా ఉందంటే..? "నేను చిన్నతనం నుంచి అంతే. మనిషికి ఎన్ని ఆలోచనలైనా రావచ్చు. మార్పు అనేది జీవితంలో మార్చలేనిది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక మళ్లీ ఆలోచించకూడదని.." ఈ సెక్సీడాళ్ అంటోంది.

ఇప్పటి వరకు "అరుంధతి" తరహా పాత్రను పోషించనని చెబుతూ వచ్చిన బొమ్మాళీ.. తన తదుపరి చిత్రంలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M