1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Heroine

Sheela| Heroine| Maska| Glamour| Parugu| Allu Arjun| Ram| Prawn Biryani| Prawn Roast | తిన్నది అరక్క తమ్ముడితో గొడవపడుతా: షీలా

షీలా
WD
"తినలేక కొందరు.. తిందామంటే ఏమీ దొరక్క కొందరుంటే.. తిని అరక్క కొందరుంటారని పెద్దలంటుంటారు. అందుకే పరిమితంగా తినాలంటారు.

కానీ నటి షీలా మాత్రం ఫుల్‌గా తిని.. అది అరగడానికి తన తమ్ముడితో కొట్టాటకు దిగుతుందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవలే చెప్పింది.

చైల్డ్ ఆర్టిస్టుగా తమిళులకు పరిచయమైన ఈ భామ తెలుగులో అల్లు అర్జున్‌తో "పరుగు"లో నటించింది. తర్వాత "మస్కా"లో చేసింది. తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం గ్యాప్‌లో షీలాను పలుకరిస్తే.. ఈ విధంగా స్పందించింది.

ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారని అడిగితే..? అమ్మరొయ్యల వేపుడు చేసి పెడితే లొట్టలేసుకుని తింటానని చెబుతూ.. రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టమంటోంది. "నేను చెన్నైలో ఉంటే అమ్మ చేసే టేస్టీ రొయ్యల వేపుడు ఇష్టపడి తింటానంది. "తిన్న తర్వాత అది అరగాలి కదా.. అందుకే తమ్ముడితో గొడవపడతానని" షీలా తెలిపింది.

అన్నట్లు.. ఎన్టీఆర్‌తో నటిస్తోన్న తాజా సినిమాలో అందాలను ఆరబోసే గ్లామర్ పాత్రను షీలా పోషిస్తోందని సినీ వర్గాల్లో టాక్. ఇంకేముంది..? మస్కా తరహా ఎన్టీఆర్ చిత్రంలోనూ తన గ్లామర్‌తో ప్రేక్షకులను షీలా కనువిందు చేయనుందన్నమాట..!.
About Writer
SELVI.M