1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Actress Asin

Mahendra Singh Dhoni | Actress Asin | ambassadors | Friendship | అసిన్ - ధోనీల స్నేహం... ఎటు పోతుందో...?

అసిన్
FILE
సెక్సీ నవ్వుల బ్యూటీ అసిన్ కోలీవుడ్ నుంచి మకాం మార్చి బాలీవుడ్‌కెళ్లిన దగ్గర్నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో స్నేహం చేస్తోంది. ఇప్పుడు ఆ బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా వదిలి టీమ్ ఇండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీతో స్నేహం మొదలెట్టిందట. ఆ మధ్య ఇద్దరూ ఓ అడ్వర్టైజ్‌మెంట్ నిమిత్తం కలిసి నటించాల్సి వచ్చిందట. ఇక అప్పట్నుంచి అసిన్‌కి ధోనీ- ధోనీకి అసిన్ ఫోన్లు మీద ఫోన్లు చేసుకుంటున్నారట.

మరో విశేషమేమంటే మొన్నీమధ్య ధోనీ తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించిన అతికొద్దిమందిలో అసిన్ కూడా ఉందట. అంతేకాదు తను విదేశాల్లో ఉన్నప్పటికీ ధోనీ అప్పుడప్పుడు అసిన్‌తో టచ్‌లో ఉంటున్నాడట.

అంతేకాదటండోయ్... షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అసిన్‌ను పిలుస్తున్నాడట. ఒకవేళ ఆమె షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లయితే ప్రస్తుతానికి తన షాపింగ్‌కు కట్ కొట్టి ఆమెకు తీరిక ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నాడట. మొత్తానికి మిత్రురాలు లేకుండా ఎక్కడికీ కదలటం లేదన్నమాట మన కెప్టెన్. కేవలం మిత్రురాలు మాత్రమే అని మనం అనుకోవచ్చంటారా...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT