1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. comments

Katrina Kaif | comments | Salman Khan | very lazy | Khan’s love | సల్మాన్ పెద్ద సోమరిపోతు: కత్రినా కైఫ్

సల్మాన్ ఖాన్
FILE
సల్మాన్ ఖాన్ పేరెత్తితేనే బాలీవుడ్ హీరోయిన్లకు దడ. అతడి గురించి పల్లెత్తు మాట అనాలన్నా వణికిపోతారు. కానీ కత్రినాకైఫ్ మాత్రం సల్మాన్‌ఖాన్ ఓ పెద్ద సోమరిపోతు అని నిర్భయంగా చెపుతోంది. అతడితో తనకున్న పరిచయంలో తను గమనించినది ఇదేనంటోందట. సల్మాన్ ను ఇలా కామెంట్ చేస్తున్నారు.... మీకేం భయం వేయడం లేదా...? అనడిగితే... ఉన్న విషయాన్నే చెప్పా. అతడు తనకు మంచి స్నేహితుడు కనుక ఏమైనా అంటానని చెపుతోందట.

ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎందుకు బెడిసి కొట్టిందని అడిగితే.... దాని గురించి సల్మానే చెప్పాలి. నేను మాత్రం అతడిని పెద్ద సోమరిపోతు అని అంటానని చెప్పిందట. ఏదేమైనా ఆమె తన ప్రియురాలే కనుక సల్మాన్ ఖాన్ బహుశా కత్రినాను ఏమీ అనకపోవచ్చు. మరొకరైతే... తగిన రీతిలో మంచి గుణపాఠం చెప్పి తీరుతాడంటున్నారు బాలీవుడ్ సినీ జనం.

ఏదేమైనా కత్రినా కత్తిలాంటి డైలాగులను విని సల్మాన్ ఊరుకుంటాడో... లేదంటే ఇటీవల ఐష్‌తో తనకు గల అనుబంధాన్ని మీడియాలో ఇంటర్యూల ద్వారా ఏకిపారేస్తున్నట్లుగా కత్రినాకైఫ్‌ను కూడా గాలికి కట్టేస్తాడో చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT