గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ఐశ్వర్యారాయ్‌ను వెంటాడుతున్న ఆ "ఇద్దరు" (Ishwaryarai | Bollywood | Salman Khan | Vivek Oberai)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
File
FILE
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్‌ను ఆ ఇద్దరు భూతంలా వెంటాడుతున్నారు. గతంలో తాను చేసిన చిన్న తప్పుకు ఐష్.. ఇపుడు శిక్ష అనుభవిస్తోంది. అయితే, తన భర్త, అత్తమామలు ఇస్తున్న నైతిక స్థైర్యం ఆమెను మరింత ముందుకు నడిపిస్తోంది. కానీ.. ఆ ఇద్దరు శత్రువులపై మాత్రం పగ తీర్చుకోలేని దయనీయ పరిస్థితిలో ఉంది. ఇంతకీ.. ఆమెను వెంటాడుతున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా. అయితే పూర్తిగా చదవండి.

విశ్వసుందరిగా ఐష్ ఎన్నిక కావడంతో ఆమెకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ఒక్కరాసి స్టార్ హోదాదక్కింది. దీంతో ఆమెను ప్రేమించి పెళ్లాడేందుకు అనేక మంది కుర్రకారు హీరోలు పోటీ పడ్డారు. ఇదేసమయంలో ఐశ్వర్యారాయ్‌కు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు కోకొల్లలుగా వచ్చాయి.

అప్పటికే చిత్ర పరిశ్రమలో స్టార్లుగా వెలుగొందుతున్న సల్మాన్ ఖాన్, వివేక్ ఓబెరాయ్‌లతో ఐష్‌కు పరిచయం ఏర్పడింది. తొలుత ఖాన్‌తో ఏర్పడిన కొద్దిపాటి పరిచయం.. ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు వీరిద్దరు ప్రేమలో విహరించారు. ఆ తర్వాత 2004 డిసెంబరులో వచ్చిన సునామీ ప్రపంచ దేశాలతో పాటు.. భారత్‌ను తాకింది.

ఆ సమయంలో సర్వం కోల్పోయి, నిరాశ్రయులుగా మారిన అనేక మంది బాధితులను మరో బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ తన శక్తిమేరకు ఆదుకున్నారు. ఆయన మానవ సేవకు చలించి పోయిన ఐష్.. మనస్సు పారేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరిగింది. కొద్ది రోజులకు ఇది కూడా వికటించడం, అభిషేక్‌ బచ్చన్‌ను ఐష్ పెళ్లాడటం జరిగిపోయాయి.

అప్పటి నుంచి ఐష్‌పై మాజీ ప్రియులు సల్మాన్‌ఖాన్‌, వివేక్‌ ఓబరాయ్‌ కక్ష కట్టారు. వీరిద్దరు ఏకమై.. ఐశ్వర్యపై రోజుకో రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆమె తమను మోసగించిందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో తనతో ప్రేమాయణం నడిపిన ఈ ఇద్దరు హీరోలు.. ఇపుడు ఏకమై తనపై దండెత్తడంతో ఐష్‌కు దిక్కుతోచడం లేదు.

కానీ.. ఆమె అత్తమామలు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్‌ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఐశ్వర్యను చూసి ఓర్వలేకే, వారిరువురూ ఏకమై ఇటువంటి నీచానికి దిగజారుతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఇలాంటి ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదని బచ్చన్ ఫ్యామిలీ అంటోంది. అయితే, ఐష్‌ అంతరాత్మను మాత్రం గత స్మృతులు, చేసిన తప్పులు వెంటాడుతూనే ఉన్నాయి... ఉంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఐశ్వర్యారాయ్, బాలీవుడ్, హీరోలు, సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్, బచ్చన్ ఫ్యామిలీ