1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Heroine

Sneha| Heroine| Glamour| Veedu Manavade| Kick| Shyam| Marriage, Heroes | హీరోయిన్లనే పెళ్లి గురించి అడుగుతారా? హీరోలను అడగరా?

స్నేహ
WD
హోమ్లీ గర్ల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల నవ్వుల సుందరి స్నేహ. తాజాగా "వీడు మనవాడే" చిత్రంలో "కిక్" ఫేమ్ శ్యామ్ చెంతన అందాలను ఆరబోస్తున్న స్నేహను పెళ్లెప్పుడని అడిగితే..? ఇప్పుడిప్పుడే కాదని అంటోంది.

కుటుంబ వర్గాల ప్రేక్షకులకు ఎంతో నచ్చిన స్నేహకు ఇటీవల ఆఫర్లు అంతగా రాకపోవడంతో.. ఎప్పటిలాగానే స్నేహా కూడా గ్లామర్ మంత్రాన్ని ఉపయోగించాలనుకుంటుంది. ఇందులో భాగంగా.. "వీడు మనవాడే" చిత్రంలో కొంత ఎక్కువ మేరకు ఎక్స్‌పోజింగ్ చేస్తోందని సినీ వర్గాల్లో టాక్.

ఈ నేపథ్యంలో.. స్నేహ పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. "అమ్మానాన్న నాకు కావాల్సిన వాడిని వెతికి పెట్టే బాధ్యత తీసుకున్నారు. నాకన్నా మెరుగ్గా వాళ్లే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ నాకు భర్తగా వచ్చే వ్యక్తి అన్నయ్య, అక్కకు అందరికీ నచ్చినవాడై ఉండాలని" అంటోంది.

పైగా నాలుగు సినిమాలు హిట్‌ అయితే అందరి దృష్టి పెళ్లిపై పడుతుంది. అదేంటో.. హీరోలను ఈ ప్రశ్న ఎందుకడగరని ఈ నవ్వుల సుందరి ప్రశ్నిస్తోంది. "పెళ్లన్నది.. ఆ ఘడియ వచ్చాక ఆగమన్నా ఆగదు కదా?" అంటూ పెద్దల మాటను గుర్తు చేసి వెళ్లిపోయింది. నిజమేగా.. దేనికైనా టైమ్ రావాలి గదా..!
About Writer
SELVI.M