Sameera reddy| Dating| Jai Chiranjeeva| Narasimhudu| Ashok| Dhana Dhan | డేటింగ్‌కైనా రెడీ.. కానీ ఆ యువకుడు ఎలా ఉండాలంటే..!
WD
ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంటోన్న సమీరాను పలకరిస్తే.. ఏకంగా డేటింగ్‌కు రెడీ అంటోంది. కాకపోతే తనకు కావాల్సిన లక్షణాలు మాత్రం ఆ యువకుడిలో పుష్కలంగా ఉండాలని చెబుతోంది. అవేమిటో బయటికి చెప్పనని, సస్పెన్స్ అని ట్విస్ట్ పెడుతోంది. అయితే ఒక క్వాలిఫికేషన్‌ను మాత్రం నోరు విప్పి చెప్పింది. డబ్బున్న బాయ్‌ఫ్రెండ్ అయితే ఎంతో మేలని అంటోంది.
"మాది వ్యాపార కుటుంబం. అలా అని పెద్ద తారల్లా క్రికెట్‌టీమ్‌ను కొనుక్కునే శక్తినాకు లేదు. అదికావాలంటే డబ్బున్న బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతోంది.
ఇటీవలే తన బాడీసైజ్‌ను తగ్గించుకున్న ఈ భామ తాజాగా.. "రెడ్ లైట్", "ధనాధన్" చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తయ్యాక దక్షిణాది సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఇంతకీ ఏ భాషో స్పష్టంగా చెప్పలేదు మరి. ఇంకేముంది..? సమీరాకు డబ్బుతో పాటు ఆమెకు కావాల్సిన లక్షణాలు గల బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో? వేచిచూడాల్సిందే..!.
